ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పోలీసు వాహనం.. పైన మృతదేహం ఉన్న బాక్సు.. ఇదేంటి అనుకుంటున్నారా? న్యాయం కోసం ఓ గ్రామానికి చెందిన ప్రజల నిరసన ఇది. యువకుడి మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేసి ఆందోళనకు దిగారు నిజామాబాద్ జిల్లా (Nizamabad) ఏర్గట్ల మండలం దోంచందా గ్రామవాసులు. దోంచందా గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి (29) ప్రేమించి మోసపోయానని మనస్తాపంతో నవంబర్ 6న విషం తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ (Hyderabad)లోని ఆస్పత్రికికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. దీంతో బంధువులు యువకుడి మృతదేహంతో బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం ఏర్గట్ల పోలీస్ స్టేషన్ (Ergatla Police Station) ముట్టడికి యత్నించారు. తాళ్లరాంపూర్ రోడ్డులో పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహంతో బంధువులు మృతదేహాన్ని పోలీస్ వాహనంపై కట్టేశారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
……………………………………………………
