
ఆకేరు న్యూస్ కరీంనగర్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ (టీజీఐసీ) కి చెందిన 18 మంది గ్రామీణ ఆవిష్కర్తలను సత్కరించింది. ఐటి శాఖ మంత్రి శ్రీ. దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా వీరికి ఇన్నోవేటర్ ఐడి కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఇన్నోవేటర్లు తమ ఆలోచనలను అంకుర సంస్థలుగా మార్చి, సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపిన తీరును కొనియాడారు.ఈ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పథి (ఐఏఎస్), టీజీఐసీ సీఈఓ మీరాజ్ ఫాహీమ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీజీఐసీ సీఈఓ మీరాజ్ ఫాహీమ్ మాట్లాడుతూ, “టీజీఐసీ లక్ష్యం ఎల్లప్పుడూ ప్రతి స్థాయిలోనూ ఇన్నోవేటర్లను ప్రోత్సహించడమే. ఈ ఐడి కార్డులు వారి సామర్థ్యంపై మా నమ్మకానికి, వారికి కొత్త అవకాశాలను తెరిచేందుకు చిహ్నం” అని అన్నారు.
………………………………………