
* తల్లిదండ్రులు ఆడొద్దని వారించినందుకు ఆత్మహత్య
* నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం
ఆకేరు న్యూస్,నిర్మల్ : ఇటీవల పిల్లలు సెల్ ఫోన్లలో పబ్జీ గేమ్‌లు ఆడుతూ వాటికి బానిసలవుతున్నారు. మానసిక రోగులుగా మారి తల్లిదండ్రలకు సమస్యగా మారుతున్నారు. తల్లి దండ్రులు పబ్జీగేమ్ అడొద్దు అని కట్టడి చేసినందుకు ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిర్మల్ జిల్లా భైంసాలో జరిగింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు నిర్మల్ జిల్లా భైంసాలో వ్యాపారం చేసుకుంటున్న బేతి సంతోష్,సాయిప్రజ దంపతులకు ఇద్దరు సంతానం. ఓ కుమారుడు ఓ కుమార్తె ఉన్నారు. కుమారుడు రిశేంద్రనే హైదరాబాద్ లోని భాష్యం స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే గత కొంత కాలంగా పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దు ఉంటున్న రిశేంద్ర సెల్ ఫోన్ లో పబ్జీ ఆటకు బానిస అయ్యాడు. కొడుకు పాఠశాలకు వెళ్లకుండా పబ్జీ గేమ్ కు బానిస కావడం తల్లిదండ్రులను మానసిక వేదనకు గురిచేసింది. ఈ నేపద్యంలో కొడుకును పబ్జీ ఆడకుండా కట్టడి చేసినందుకు మనస్థాపానికి గురైన రిశేంద్ర బుధవారం సాయంత్రం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………………