
ఆకేరున్యూస్ వరంగల్ :వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం -2024 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి,ప్రభాకర్ రావు, సురేష్ కుమార్ తో పాటు, ఏసీపీలు ఆర్. ఐలు, ఇన్స్ స్పెక్టర్లు, ఎస్. ఐలు ఇతర పోలీస్ విభాగాలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది, పరిపాలన సిబ్బంది పాల్గొన్నారు.
…………………………………………..