
* జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరు న్యూస్, ములుగు:ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో 50 దరఖాస్తులు రాగా అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 09, భూ సమస్యలు 08, ఉపాధి కల్పనకు 05, పెన్షన్ 05, ఇతర ఇతర శాఖలకు సంబంధించినవి 23 దరఖాస్తుల స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి పరివాహక మండలాలైన వాజేడు, వెంకటాపురం, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల పరిధిలోని గ్రామాల అధికారులు, ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని, ఉదృతంగా పారుతున్న గోదావరి కారణంగా ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగిందని, ఈ నెల 6 తేదీ వరకు జిల్లా లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అందరు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.జిల్లా లో చెరువులు, కుంటల వద్దకు ప్రజలు పశువులను మేతకు తీసుకుపోవద్దని, చేపల వేటకు వెళ్ళవద్దని, ప్రవహిస్తున్న నీటిలో ఈత కొట్టరాదని అన్నారు. జిల్లాలోని లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ముందస్తు చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. వర్షాకాలం, వరదల దృష్ట్యా తక్షణ సహాయం కొరకు కలెక్టరేట్ టోల్ ఫ్రీ నెంబర్ 18004257109 కు కంట్రోల్ రూమ్లో 24 గంటలు అధికారులు, సిబ్బంది షిఫ్టుల వారిగా అందుబాటులో ఉంటూ, వర్షానికి, జలమాయమైయ్యే ప్రాంతాల సమస్య కు సంబంధించిన ఫిర్యాదులు అందిన వెంటనే సంబంధిత శాఖల అధికారులను తక్షణ పరిష్కార నిమిత్తం పంపడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………