
– కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన గడువులోగా ఆర్ఓబి పూర్తి చెయ్యలేకపోతే బ్రిడ్జి కూల్చేస్తాం.
– బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణ పనుల జాప్యం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. హుజురాబాద్ – పరకాల రహదారిపై గత 10 ఏండ్లుగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను బుధవారం బిజెపి శ్రేణులతో కలిసి గంగాడి కృష్ణారెడ్డి పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు…. రైల్వే ఆర్ఓబి నిర్మాణ పనులు పూర్తి చేయలేకపోతే ఆర్ఓబిని కూల్చివేసి, ప్రజలకు క్షమాపణ చెప్తామన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరికతో ఆర్ఓబి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఆర్ఓబి నిర్మాణ పనుల పట్ల అశ్రద్ధ వహించకుండా త్వరితగతిన పూర్తి చేయడానికి సంబంధిత కాంట్రాక్టర్, రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.ఆర్ఓబి పూర్తయితే ప్రజా ప్రయాణానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, కమలాపూర్ మండల అధ్యక్షులు ర్యాకం శ్రీనివాస్,జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బండి కోటేశ్వర్, మండల ప్రధాన కార్యదర్శి భూపతి ప్రవీణ్,జిల్లా కౌన్సిల్ మెంబెర్ బండారి సుధాకర్, చిట్టీ సుందరయ్య, పిట్టల సతీష్, ర్యాకం సుధాకర్, పోతిరెడ్డి శంకర్, దండబోయిన శ్రీనివాస్,ర్యాకం సదానందం, గుండెకారి శ్రీనివాస్,చీర్స్ లచ్చన్న, బండారి శ్రీనివాస్,అకినపెల్లి రవీందర్, ఎగ్గొజు శ్రీనివాస్, తోట రాంప్రసాద్,లు పాల్గొన్నారు.
…………………………………………….