* ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల లాంటివి
* మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, ములుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం వెంకటాపూర్ మండలం లోని పాలంపేట రామప్ప సరస్సు లో 13 కోట్ల రూపాయల నిధులతో చేపట్టిన ద్వీపం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ రవీందర్ రెడ్డి లతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రామప్ప సరస్సు లో ద్వీపం అభివృద్ధి చేయటానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని అందులో భాగంగా శివుడి విగ్రహం ఏర్పాటు చేయడానికి, చెరువు మధ్యలో 20 ఎకరాల స్థలం ఉండగా ఏడు ఎకరాలలో టూరిజం శాఖ ద్వీపం నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వివరించారు. ములుగు మండలం ఇంచర్ల గ్రామ సమీపంలో 35 కోట్ల రూపాయలతో హంపి థియేటర్ ను ఏర్పాటు చేసి హస్తకళల తయారీకి అవకాశం కల్పించడం జరుగుతుందన్నారు. అదే ప్రాంతంలో విలేజ్ పార్క్ తో పాటు నూనె తయారు చేసే కంపెనీ ఏర్పాటు కాబోతున్నదని, గోవిందరావుపేట మండలం లక్నవరం సరస్సులో మరికొన్ని ఐలాండ్ లా నిర్మాణం ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. తాడువాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల పున నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, మంగపేట మండలం మల్లూరు లోని లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని వివరించారు. బోగోత జలపాతం వద్ద పర్యాటకులపై నీరు పడే విధంగా వంతెనలను ఏర్పాటు చేయబోతున్నామని, బ్లాక్ బెర్రీ తిరిగి ప్రారంభించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నదని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను చురుకుగా కొనసాగించి భావితరాల వారికి అందిస్తామని, తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సీతక్క కోరారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఇంజనీరింగ్ డిఈ ధనరాజ్, ఏ ఈ విజయ్, తహసిల్దార్ గిరిబాబు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.రామప్ప సరస్సులో మరో శివుని విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం
