
* ఫస్ట్ షాట్లోనే పెద్ది అదరగొట్టేశాడు
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న తాజా చిత్రం పెద్ది (Peddi) నుంచి ఫస్ట్ షాట్ రిలీజైంది. శ్రీరామ నవమి సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో అభిమానులను పులకింపచేస్తోంది. ఈ సినిమాకు ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా (Buchibabu Sana) దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ (Jahnvi Kapoor) కథానాయికగా నటిస్తుంది. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా రాబోతుండగా.. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. “ఒకటే పని చేయడానికి.. ఒకే లాగా బతకడానికి ఇంత పెద్ద బతుకెందుకు. ఏదేమైనా ఈ నెల మీద ఉన్నప్పుడే చేసేయాలి. పుడతామా ఏంటి మళ్లీ” అంటూ రామ్ చరణ్ డైలాగ్తో ఈ గ్లింప్స్ సాగింది. ఇందులో రామ్ చరణ్ గల్లీ క్రికెటర్గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
…………………………………