
* అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు
* ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జి.
ఆకేరు న్యూస్, ములుగు: ప్రస్తుత ఏడాది ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో,ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి తెలిపారు.మంగళవారం తాడ్వాయి రైతు వేదికలో జిల్లా అదనపు కలెక్టర్ సి.హెచ్. మహేందర్ జీ. తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల పరిధిలోని వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు నిర్వహించిన శిక్షణ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు నిర్వహణ సంబంధిత అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కలిసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులందరూ టార్పాలిన్ కవర్లు ఎక్కువగా ఉంచుకోవాలన్నారు. ఐకెపి, సమ భావన సంఘాల సభ్యులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు, తదితర సంస్థల ద్వారా జిల్లాలో సుమారు 175 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, అందుకోసం జిల్లా స్థాయి దాన్యం కొనుగోళ్ల కేంద్రాల కమిటీ ద్వారా ప్రభుత్వం సూచించిన ప్రకారం ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు.
ధాన్యం సేకరణ వివరాలను వ్యవసాయ శాఖ ద్వార స్వీకరించి కేంద్రాలకు వచ్చే దాన్యం పూర్తి వివరాలు డాటా ఎంట్రీ లో పొందుపరచాలన్నారు. కొనుగోలు రవాణా, డ్రై మిషన్,ప్యాడి క్లీనర్స్, వేయింగ్ మిషన్స్, మ్యాచ్చర్స్, ఆటోమేటిక్ జాలి మిషన్లు, ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.కేంద్రాలలో గన్ని సంచులు, అవసరానికి అనుగుణంగా ముందస్తుగా సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు సెంటర్లో కనీస వసతులైన మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ప్యాడి సెంటర్లను శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ ప్రతిరోజు చేయాలన్నారు.కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే రైస్ మిల్లులకు పంపే విధంగా ప్రణాళిక ప్రకారం లారీలను, హమాలీలను సిద్ధంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలని, కొనుగోళ్లకు సంబంధించి దాన్యం డబ్బుల ను రైతుల ఖాతాలలో వెంటనే జమ అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని, కేంద్రాలలో నిబంధనల ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ఆన్ని శాఖల సమన్వయంతో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి షా ఫైజల్ హుస్సేని, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ రాం పతి, జిల్లా సహకార అధికారి సర్ధార్ సింగ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………