* ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, డెస్క్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలో చనిపోతారని, అప్పుడే యుద్ధం ఆగిపోతుందని తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జెలెన్స్కీ (Zelenskyy) ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పుతిన్ త్వరలో చనిపోతారు. అది నిజం. దీంతో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసిపోతోంది. అయితే, ఈ యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. త్వరలోనే ఇదంతా ముగిసేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలి’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఇటీవల పుతిన్ (Putin) ఆరోగ్యంపై ఊహాగానాల వచ్చాయి. ఈ క్రమంలోనే జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పుతిన్ దగ్గుతున్నట్లు, ఆయన కాళ్లు, చేతులు వణుకుతున్నట్లు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈక్రమంలో జాగా జెలెన్స్కీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
……………………………………………..
