
*నిషేధిత భూమి రిజిస్రేషన్ అంశంలోఅవకతవకలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బాచుపల్లిలో నిషేధం ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ అంశంలో అశోక్ ను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ చేయడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి బదిలీలో భారీగా నగదు చేతులు మారినట్లు తెలిసింది. ఈ కేసులో పద్మజారెడ్డి అనే వ్యక్తి సమర్పించిన నకిలీ పత్రాలను నమోదు చేసిన నాంపల్లిలోని చిట్స్ అండ్ ఫైనాన్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ వుజ్జిని జ్యోతిని కూడా పోలీసులు గతంలోఅరెస్టు చేశారు. చనిపోయిన మహిళ పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి దాదాపు 20 కోట్ల రూపాయల విలువైన భూమిని రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలున్నాయి.
……………………………….