
* మెడికోపై సీనియర్ల వేధింపులు
* పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
ఆకేరు న్యూస్, నిజామాబాద్ : నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. రాహుల్ అనే జూనియర్ మెడికోపై ర్యాంగింగ్ పేరుతో సీనియర్ల వేధింపులు ఎక్కువయ్యాయి, ఈ నేపధ్యంలో పోలీసులను ఆశ్రయించాడు. సీనియర్ల వేధింపులు తట్టుకోలేక ప్రశ్నించింనందుకు రాహుల్ అటెండెన్స్ లో కూడా కోత విధిస్తున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు, అటెండ్ అయినా కూడా ఆబ్సెంట్ వేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపధ్యంలో వేధింపులు భరించలేక సీనియర్లను నిలదీయడంతో అతడిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో రాహుల్ చేసేదేమీ లేక సీనియర్లపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, సీనియర్ల దాడిలో గాయపడ్డ రాహుల్ కు ఆస్పత్రిలో చికిత్స అందించారు. కళాశాల సూపరింటెండెంట్ తో పోలీస్ అధికారులు సమావేశమయి వివరాలు సేకరిస్తున్నారు. ర్యాంగింగ్ పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
……………………………………….