anumana pakshi song release
* ఫన్ సాంగ్ రిలీజ్
* రాగ్ మయూర్, విమల్ కృష్ణ కాంబినేషన్లో ‘అనుమాన పక్షి’
ఆకేరు న్యూస్, సినిమా డెస్క్: ‘డీజే టిల్లు’ చిత్రంతో సెన్సేషనల్ డెబ్యూ చేసిన దర్శకుడు విమల్ కృష్ణ, నటుడు రాగ్ మయూర్‌తో కలిసి మరో యూనిక్ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అనుమాన పక్షి’. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
* ఫన్‌గా హీరో క్యారెక్టర్
ఇప్పటికే విడుదలైన టీజర్, విభిన్నమైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా చిత్ర బృందం ‘అతిగా ఆలోచించకురా’ అనే ఫన్ సాంగ్‌ను విడుదల చేసింది. హీరో క్యారెక్టర్‌ను సరదాగా పరిచయం చేస్తూ ఈ పాట సాగుతుంది. అతడి స్వభావం, ఆలోచనా విధానాన్ని వినోదాత్మకంగా చూపించారు. ‘అతిగా ఆలోచించకురా’ పాటకు శ్రీచరణ్ పాకాల ఆకట్టుకునే ట్యూన్ అందించారు. సాన్వి, రవి ప్రకాష్ చోడిమళ్ల కలిసి ఆలపించగా.. కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు. పాట విడుదలైన వెంటనే ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.
* విభిన్నమైన కాన్సెప్ట్‌తో
‘డీజే టిల్లు’తో తనదైన క్యారెక్టరైజేషన్, హ్యూమర్‌తో గుర్తింపు తెచ్చుకున్న విమల్ కృష్ణ.. ‘అనుమాన పక్షి’తో మరో వైవిధ్యమైన కాన్సెప్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మెరిన్ ఫిలిప్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రిన్స్ సెసిల్, రాశి, అనన్య, చరిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా సునీల్ కుమార్ నామా, సంగీత దర్శకుడిగా శ్రీచరణ్ పాకాల పనిచేస్తున్నారు. జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా, అభినవ్ కునపరెడ్డి ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
‘అనుమాన పక్షి’ సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల కానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
