
ఆకేరున్యూస్ డెస్క్: రాహుల్ గాంధీ త ఎన్నికల కమిషన్ పై యద్ధాన్ని బీహార్ నుంచే మొదలు పెట్టనున్నారు. బిహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటు హక్కును దోచుకుంటున్నారని రాహుల్ ఆరోపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనకు అనుకూలమైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో ఉంచి బీజేపీకి ఓటు వేయరు అనుకున్న వారిని ఓటర్ల లిస్టు నుంచి తొలగిస్తోందని రాహుల్ గాంధీ తో పాటు ఆర్ జే డీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తేజస్వీ యాదవ్ కూడా ఓటర్ల జాబితా సవరణపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. బిహార్‌లో ఎన్నికల జరుగనున్న నేపధ్యంలో రాహుల్ చేపట్టిన ఓట్ అధికార్ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. రాహుల్ గాంధి ఈ యాత్రను నేడు బిహార్ లోని
ససారం నుంచి ప్రారంభించారు. ఈ యాత్ర 16 రోజులపాటు 1,300 కిలోమీటర్ల దూరం 25 జిల్లాల
మీదుగా కొనసాగనుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించే భారీ సభతో యాత్ర ముగుస్తుంది. రాహుల్‌తోపాటు ఇండియా కూటమిలో భాగస్వాములైన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మూడు
వామపక్ష పార్టీల నేతలు యాత్రలో పాల్గొంటారు. కాలినడకతోపాటు వాహనాల్లో ప్రయాణిస్తూ
రాహుల్ ఈ యాత్రను కొనసాగిస్తారు.ఇదిలావుంటే ఓటు హక్కుపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా శనివారం రాహుల్‌గాంధీ ‘లాపతా ఓటు’ (గల్లంతైన ఓటు) పేరుతో ‘ఎక్స్’లో ఒక వీడియోను షేర్ చేశారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా పోరాడి, మన హక్కులను కాపాడుకుందామని రాహుల్ ఆ వీడియోలో పిలుపునిచ్చారు.
……………………………