* మాజీ మంత్రి కేటీఆర్ సెటైరియకల్ ట్వీట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ వైపు కాంగ్రెస్(Congress) సర్కారు.. 11 వేల మంది టీచర్లకు ఉద్యోగ నియమాకపత్రాలు ఇస్తుండగా బీఆర్ ఎస్(Brs) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr) సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. గతంలో హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలను ఉటంకిస్తూ విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పడానికి హైదరాబాద్‌లోని అశోక్‌నగర్(Ashoknagar)లో యువత ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు. అలాగే యువ వికాసం(Yuva Vikasam) కింద విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చినందుకు, టీఎస్పీఎస్సీని పునరుద్ధరించినందుకు ధన్యవాదాలు చెప్పేందుకు యువత ఎదురుచూస్తున్నారని కేటీఆర్ తెలిపారు. గ్యారంటీలను నెరవేర్చిన మిమ్మల్ని యువతను కలిసేందుకు హైదరాబాద్‌కు సాదరంగా స్వాగతం పలుకుతున్నామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గత ఏడాది హైదరాబాద్‌కు వచ్చినప్పుడు అశోక్‌నగర్‌కు వెళ్లి పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న నిరుద్యోగులను కలిసిన రాహుల్‌గాంధీ(Rahul Gandhi) నాటి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజా పాలన అధికారంలోకి రాగానే ముందుగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని తెలిపారు. అలాగే ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. యూపీఎస్సీ తరహాలో టీఎపీఎస్సీని పునరుద్ధరిస్తామని.. యువ వికాసం కింద ఫీజులు, కోచింగ్ ఫీజు చెల్లింపుల కోసం 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని ప్రకటించారు. వాటిని అమలుచేయని నేపథ్యంలో ట్విటర్(Twitter)లో కేటీఆర్ విమర్శనస్త్రాలు సంధించారు.
…………………………………………..