![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/7d836465-c506-4b94-92a7-5e0124ecc8db-1024x768.jpg)
* కొర్రీలు, వాయిదాల పద్దతి లేకుండా ఏ పథకం అమలు లేదు
* కాంగ్రెస్‌లో మళ్లీ అదే ముఠాల సంస్కృతి
* సీఎం పదవికి ఢల్లీిలో పైరవీలు
* కేసీఆర్ ది సుస్థిర, కాంగ్రెస్‌ది అస్థిర ప్రభుత్వం
* మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆకేరున్యూస్, నిజామాబాద్: ఆరు హామీలపై ప్రశ్నిస్తారనే భయంతో పాటు రేవంత్ మొహం చూడటం ఇష్టం లేకనే రాహుల్ వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రీసర్వేలు, వాయిదాల పద్దతి లేకుండా ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లిద్దరూ ఐరన్ లెగ్ లేనని వారెక్కడ కాలు పెడితే అక్కడ కాంగ్రెస్ బుగ్గి పాలై బొగ్గులుగా మారుతోందని జీవన్ రెడ్డి వ్యాఖ్యా నించారు. తాజాగా కులగణన రిపోర్టు పట్టుకెళ్లినా రేవంత్ ను కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోలేదని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు జరగక పోవడం, రుణమాఫీ, రైతు భరోసా, పెన్షన్లు, తులం బంగారం, ప్రతీ మహిళలకు రూ.2500 వంటి ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సివస్తుందనే భయంతో రాహుల్ గాంధీ తెలంగాణకు రావడానికి భయపడుతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.కాంగ్రెస్ లో మళ్లీ అదే ముఠాల సంస్కృతి రాజుకుంటున్నదని ఆయన తెలిపారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి నేతలు ఎవరికి వారే గుంపులుగా విడిపోయి ఢల్లీిలో సీఎం పదవి కోసం పైరవీలు చేసుకుంటూ పాలనను గాలికొదిలేసారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కొర్రీలు, వాయిదాల పద్దతి లేకుండా ఏ పథకం అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు జీరో వస్తుందని, హామీలు అమలు చేయని కాంగ్రెస్ నాయకులను గ్రామ పొలిమేరల్లోకి రాకుండా తరిమికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ లు కలిసి పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ విజయాన్ని అడ్డుకోలేరని, రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా కారు రావాలి, కేసీఆర్ కావాలి అని ప్రజలు కోరుకుంటున్నార న్నారు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
……………………………………….