* భారీ నుంచి అతి భారీ వర్షాలు
* కలెక్టర్లతో సీఎస్ టెలికాన్ఫరెన్స్
* అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టర్లతో ఏపీ సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను నేపథ్యంలో కలెక్టర్లు పూర్తి అప్రమత్తతో ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టజరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామస్థాయిలోనూ సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని, నిత్యావసరాలు అందుబాటులో ఉంచాలని, తగినన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు, మొబైల్ సేవలకు అంతరాయాలు కలగకుండా ఆయా విభాగాలు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టెలికాం సంస్థలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాలువలు, చెరువులు, నదులను నిరంతరం పరిశీలించాలని పేర్కొన్నారు. ముంపు ముప్పు లేకుండా చూడాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు.
………………………………………………..
