
* పొంగిపొర్లుతున్న వాగులు..వంకలు
* రాకపోకలకు అంతరాయం
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలంగాణ (Telangana) రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తన్నాయి. ఆంధ్రపదేశ్ (Andhrapradesh) రాష్ట్రంలోని విజయవాడ (Vijayawada), గుంటూరు (Gunturu) ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర (Maharastra), కర్ణాటక (Karnataka) రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు వాగులు. నదులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన జూరాల (Jurala), తుంగభద్ర (Tungabhadra) నుంచి వరద నీరు శ్రీశైలానికి చేరుతుంది. ఆంధ్రప్రదేశ్, ఎగువ ప్రాంతాల నీరు కృష్ణానదికి వరద పోటెత్తడంతో జూరాల, శ్రీశైలం (Srisylam) , నాగార్జునసాగర్ (Nagarjunasagar), టైలపాండ్, పులిచింత (Pulichinntala) ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేశారు. వచ్చిన వరదను వచ్చినట్లే విడుదల చేస్తన్నారు. బుడమేరు, పాలేరు వాగులు ప్రకాశం బ్యారేజికి పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజీ గేట్లను పైకి ఎత్తి నీటిని వదులుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో..
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో శుక్రవారం కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరంగల్ జిల్లలోని నల్లబెల్లి (Nallabelli) మండలంలో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.ములుగు (Mulugu) జిల్లా వెంకటాపురం (Venkatgapuram) మండలంలో మల్లపురం (Mallapuram),సీతరాంపురం (Sitarampuram), కలిపాక (kalipaka) వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దవాడు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాటారం మేడారంల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి,దాదాపు 16 గ్రామాల ప్రజలు రవాణాసౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు.
జల దిగ్బంధంలో వన దుర్గమ్మ
మెదక్ (Medak) జిల్లాలోని ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం చుట్టూ భారీగా నీరు చేరింది. సింగూరులోని నక్క వాగు నుంచి వనదుర్గ ఆనకట్టకు 25 వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. ఆలయం వైపు భక్తులు ఎవరూ వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వరదనీరు ఉధృతి తగ్గే వరకు భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. మంజీరా నది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు చేపల వేటకు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు.
నేడు భారీ వర్షాలు
నేడు తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మది ఆదిలాబాద్ (Adilabad), కరీంనగర్ (Karimnagar), నిజామాబాద్ (Nizamabad) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది…
…………………………………………