* వాతావరణ శాఖ మరో హెచ్చరిక
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌ను వర్షాలు వీడడం లేదు. పగలంతా సాధారణ వాతావరణం ఉన్నప్పటికీ సాయంత్రం అయ్యేసరికి ఉరుము ఉరిమి.. వరుణుడు గర్జిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఇదే పరిస్థితి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. తేరుకునేలోపు మళ్లీ వర్షం పడుతుండడంతో కొన్ని రోజులుగా బస్తీలు నీళ్లలోనే ఉంటున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ(TELANGANA)లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ రోజు, రేపు తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్(HYDERABAD)లోనూ వర్షం పడే సూచనుందని తెలిపింది. అలాగే, ఏపీలో పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షం అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, ఈనెల 27 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
……………………………………….
