
* ఈదురుగాలులతో వానలు పడే అవకాశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రాబోయే మూడురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానలు పడుతాయని తెలిపింది. కొన్ని జిల్లాల్లో బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోవిూటర్లు, మరికొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోవిూటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు- ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందంది. నైరుతి బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి 1.5 కి.విూ.ఎత్తులో కొనసాగిన ఉపరితల ఆవర్తనం.. బలహీన పడిరదని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం సైతం హైదరాబాద్ మహానగరంలో ఉదయం నుంచి ఎండలు మండిపోయాయి. మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి ఉన్న సంగతి తెలిసిందే. ఇక వాతావరణంలో తేమ శాతం బాగా తగ్గిపోయింది. ఇక నీటి ఎద్దడి సైతం ప్రజలును తీవ్ర ఇబ్బందికి గురి చేస్తోంది. గురువారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని చెప్పింది. శుక్రవారం భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోవిూటర్ల వేగంతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది.
………………………………….