
* సోషల్ మీడియాకు మద్దతు తెలిపిన రాజగోపాల్ రెడ్డి
ఆకేరున్యూస్,హైదరాబాద్: మునుగోడు (MUNUGODU)ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (KOMATIREDDY RAJGOPAL REDDY)మరో సారి సీఎం రేవంత్ రెడ్డిపై పరోక్షంగా ఎదురుదాడి చేశారు. ఎక్స్ వేదికగా ఆయన సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ సోషల్ మీడియా(SOCIAL MEDIA)కు మద్దతు నిలిచారు. నవతెలంగాణ పదవ వార్షికోత్సవంలో పాల్గొన్న సీఎం జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కనీస పరిజ్ఞానం లేని కొంతమంది సోషల్ మీడియా పేరుతో చలామణి అవుతూ తప్పుడు రాతలు రాస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. అలాంటి వారిని మెయిన్ స్ట్రీం మీడియా జర్నలిస్టులు పక్కన పెట్టాలని రేవంత్ ( CM REVANTH REDDY) అన్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా పేర్లతో ఎవడు పడితేవాడు వస్తున్నాడని, వాళ్లు కూర్చునే తీరు కూడా ధిక్కార స్వభావంతో ఉంటున్నారని, నమస్తే పెట్టరా? అన్నట్టుగా చూస్తున్నారని చెప్పారు. నిజమైన జర్నలిస్టులు ఒకవైపు, ముసుగు జర్నలిస్టులు ఒకవైపు ఉండాలని సూచించారు.అవారాగా తిరిగేవాళ్లు, తిట్లు వచ్చినవాళ్లు, ఏది పడితే అది మాట్లాడేవారు జర్నలిస్టు అనే ముసుగేసుకొని సోషల్మీడియాలో అందరిపై అసహ్యకరమైన భాషను ఉపయోగిస్తున్నారని అన్నారు. మెయిన్ స్ట్రీం మీడియా జర్నలిస్టుల పక్కన కూర్యోవడానికి కూడా సోషల్ మీడియా జర్నలిస్టులకు అర్హత లేదని సీఎం అన్నారు.
ఘాటుగా స్పందించిన కోమటిరెడ్డి
సీఎం కామెంట్స్ పై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా ఘాటు గా స్పందించారు. జర్పలిస్టులను విభజించడం సరికాదన్నారు .మెయిన్ స్ట్రీం మీడియాను( MAIN STREEM MEDIA) సోషల్ మీడియాపై ఎగదోయడం సరికాదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియా సామాజిక బాధ్యతతో పనిచేస్తోందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.సోషల్ మీడియా జర్నలిస్టులు ఒత్తడికి బెదిరింపులకు గురవుతున్నా సామాజిక బాధ్యతతో భయం లేకుండా పనిచేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు రాజగోపాల్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
…………………………………………..