
*రాజగోపాల్ రెడ్డితో భేటీ కానున్న మల్లు రవి
ఆకేరు న్యూస్,డెస్క్ : ఈ మధ్య తరచుగా సీఎం రేవంత్ రెడ్డి(REVANTH REDDY)పై మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (KOMATI REDDY RAJGOPAL REDDY)చేస్తున్న విమర్శలు పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు సమాచారం, ఈ మేరకు క్రమశిక్షణా సంఘం చైర్మన్ మల్లురవి(MALLU RAVI)కి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని చక్కదిద్దే పనిని అప్పగించినట్లు తెలుస్తోంది, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉన్న మల్లు రవి హైదరాబాద్ వచ్చిన తరువాత రాజగోపాల్ రెడ్డితో భేటీ కానున్నారు. రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శలు పార్టీలో క్రమశిక్షణ లోపించిందనే సంకేతాలకు చిహ్నంగా పార్టీ అధిష్టానం భావిస్తోంది.రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై పార్టీలో తీవ్ర చర్చజరుగుతున్నట్లు తెలిసింది. ప్రజల్లో పార్టీ పట్ల చులకన భావం ఏర్పడే అవకాశాలు ఉంటాయని పార్టీ అధిష్టానం భావిస్తోంది, మంత్రి పదవి ఇవ్వనంత మాత్రాన పార్టీ పరువు తీసే విధంగా విమర్శలు చేయడవ సరికాదని పార్టీలో సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీలో అంతర్గత కలహాలు లేకుండా చూడాలని పార్టీ అధిష్టానం కృతనిశ్చయంతో ఉంది. మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి వాటిని ఉపేక్షించవద్దని పార్టీ అధిష్టానం భావిస్తోంది.. ఈ మేరకు రాజగోపాల్ రెడ్డికి క్రమశిక్షణా సంఘం నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చజరుగుతోంది.
………………………………..