Rajasthan Sarpanch Elections
* రాజస్థాన్ సర్పంచ్ ఎన్నికల్లో బ్యాలెట్ గందరగోళం..
* గుర్తుల ఎదుట తప్పుగా పేర్ల ముద్రణ..
* అభ్యర్థులు, ఓటర్ల ఆందోళన..!
ఆకేరు న్యూస్, రాజస్థాన్ : రాజస్థాన్‌లోని జాలొర జిల్లా బాగ్రా గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్ సమయంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. జగనాథ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ నంబర్ 3లో అభ్యర్థుల గుర్తుల ఎదుట వారి సరైన పేర్లు ముద్రించకపోవడం, మరికొన్ని చోట్ల పేర్లు పూర్తిగా లేకపోవడంతో ఓటర్లు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఎన్నికల అధికారుల ఈ నిర్లక్ష్య వైఖరి వల్ల అభ్యర్థులకు, ఓటర్లకు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
* ఓటరు చొరవతో వెలుగులోకి..
ఓ ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లిన సమయంలో ఈ భారీ గందరగోళం బయటపడింది. గుర్తుల ఎదుట పేర్లు లేకపోవడం, తప్పుగా ముద్రించి ఉండటాన్ని గుర్తించిన ఓటరు వెంటనే తోటి ఓటర్లకు, అభ్యర్థులకు సమాచారం అందించారు.
* ఓటర్లలో అయోమయం..
సరైన పేర్లు మరియు గుర్తులు లేకపోవడం వల్ల ఏ అభ్యర్థికి ఏ గుర్తు కేటాయించారో అర్థంకాక ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందని స్థానికులు ఆరోపించారు.
*ఎన్నికల సంఘానికి ఫిర్యాదు..
ఈ పొరపాటు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, తమ విజయవకాశాలపై ఇది ప్రభావం చూపుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అభ్యర్థులందరూ కలిసి జాలొర జిల్లా ఎన్నికల అధికారులకు లిఖితపూర్వక అర్జీ సమర్పించారు.
* నిష్పక్షపాత విచారణకు డిమాండ్..
ఈ ఘటన వెనుక ఉన్న అధికారుల వైఫల్యంపై సమగ్రంగా మరియు నిష్పక్షపాతంగా విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు తీవ్రంగా డిమాండ్ చేశారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

