వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.వి.నిర్మలా గీతాంబ, హనుమకొండ ఇంఛార్జి ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణా దేవి
ఆకేరు న్యూస్, వరంగల్ : రాజీమార్గమే.. రాజమార్గమని.. కక్షిదారులు తమ కేసులను రాజీ కుదుర్చుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.వి.నిర్మలా గీతాంబ మరియు హనుమకొండ ఇంఛార్జి ప్రధాన న్యాయమూర్తి బి.అపర్ణా దేవి విజ్ఞప్తి చేశారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో న్యాయమూర్తులు మాట్లాడుతూ ‘‘గౌరవ జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాలను అనుసరించి, వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అ నెల 28న వరంగల్, హనుమకొండ జిల్లా కోర్టులలో అలాగే నర్సంపేట, పర్కాల మండల కోర్టులలో జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని తెలిపారు. లోక్ అదాలత్‌లో రాజీపడే క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ, కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్సూమర్ ఫోరమ్ కేసులు, ట్రాఫిక్ ఈ-ఛాలన్ కేసులు మరియు ప్రీ- లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడదగు కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలిపి, రాజీ కుదుర్చుకుని ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని తెలిపారు. రాజీపడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరుకావాలని పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు ఇప్పటికే పోలీసు అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో, ఎక్సైజ్ శాఖ అధికారులతో, ఇన్సూరెన్స్ అధికారులతో, న్యాయవాదులతో, బ్యాంకు మరియు చిట్‌ఫండ్ మేనేజర్లతో వేరు వేరు సమావేశాలు నిర్వహించి, అధిక కేసుల పరిష్కార దిశగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పటివరకు వరంగల్ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో గుర్తించబడిన కేసులలో మొత్తం 1477 రాజీపడదగు పెండిరగ్ కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని కోరామన్నారు. వీటిలో క్రిమినల్ – 1366, ఎన్.ఐ.యాక్ట్ – 19, ఎం.ఎ.సి.టి.- 55, ల్యాండ్ అక్విజిషన్ -04, మనీ రికవరీ-09, అదర్ సివిల్ -44, మరియు ప్రీ-లిటిగేషన్ ఎలక్ట్రిసిటి కేసులు- 2200, బ్యాంక్ కేసులు – 1451, బి.ఎస్.యన్.ఎల్. కేసులు-212 అని తెలిపారు.
హనుమకొండ జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్‌లో గుర్తించబడిన కేసులలో మొత్తం 1044 రాజీపడదగు పెండిరగ్ కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీమార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలన్నారు. వీటిలో క్రిమినల్ – 737, ఎన్.ఐ.యాక్ట్ – 74, ఎం.ఎ.సి.టి.- 47, బ్యాంక్ రికవరీ-18, వివాహ సంబంధిత-76, అదర్ సివిల్ -92, మరియు ప్రీ-లిటిగేషన్ బ్యాంక్ కేసులు – 747, బి.ఎస్.యన్.ఎల్. కేసులు-269. అని తెలిపారు. రాజీ పడదగు కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను సాయంత్రం 5.00 గంటలలోపు ఏ రోజైనా రాజీ కుదుర్చుకునేలా ప్రీ-లోక్ అదాలత్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ప్రీ-లోక్ అదాలత్ లో ప్రీ- లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్, ప్రి-లోక్ అదాలత్‌పై ఎటువంటి సలహాలకైననూ, సందేహాలకైననూ, ఏదేని న్యాయసహాయం కోసం న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందాలన్నారు.
……………………………………………