
* ఆర్టీసీ బస్సు సర్వీసును కొనసాగించాలి
* డివైఎఫ్ఐ డిమాండ్
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో ఆర్టీసీ సేవలను కొనసాగించాలని కోరుతూ కలెక్టర్ దివాకర టిఎస్ కు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కలువల రవీందర్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ములుగు నుండి బండారుపల్లి బుద్ధారం మీదుగా పరకాలకు వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులో ప్రతిరోజు వందలాదిమంది తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని రాళ్లవాగు వద్ద నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఆర్టీసీ సర్వీసులను రద్దు చేశారన్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం బ్రిడ్జి పైనుంచి బస్సులు నడిచే పరిస్థితి లేకపోవడంతో పరకాల నుంచి వచ్చే ఆర్టీసీ బస్సుల ను వెంకటాపూర్ మండలం నర్సాపూర్ వరకే తీసుకువచ్చి ప్రయాణికులను వదిలి వెళ్తున్నారని దీంతో ములుగు వైపు వచ్చే ప్రయాణికులు ,చిరు వ్యాపారులు, రైతులు, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఉన్నతాధికారులు స్పందించి వెంటనే బ్రిడ్జి మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టి ఆర్టీసీ బస్సులను యధావిధిగా నడిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ మండల అధ్యక్షుడు పులియాల తిరుపతి,కమిటీ సభ్యుడు ఎట్టవేణి రాము తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………………