* త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ
ఆకేరు న్యూస్, ములుగు: రామప్పలోని ప్రతి ఒక్క శిల్పం ఆనాడు నిర్మించిన కాకతీయుల కళ నైపుణ్యానికి అద్దం పడుతుందని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ పేర్కొన్నారు.వరంగల్ లో ఉన్న పర్యాటక క్షేత్రాలను వీక్షించడానికి రెండు రోజుల పర్యటనలో భాగంగా శనివారం త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ హేమంత్ వర్మ దంపతులు హన్మకొండ, నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్ కు విచ్చేసినారు . ముందుగా వారికి ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ హెచ్ఆర్డి శ్రీ సి. ప్రభాకర్ పుష్ప గుచ్చముతో ఆహ్వానం పలికారు . అనంతరం ములుగు జిల్లాలోని వెంకటపురంలోని పాలంపేట గ్రామములోని రామప్ప దేవాలయాన్ని త్రిపుర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సందర్శించారు . ముందుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పూజారులు వారిచే శ్రీ రామలింగేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం గైడ్ రామప్ప చరిత్రను వివరించారు . చైర్మన్ హేమంత్ వర్మ మాట్లాడుతూ రామప్ప శిల్పాలలో కళాత్మక వైభవం ఉట్టిపడుతున్నట్లు నిర్మించారని అన్నారు . యునెస్కో గౌరవం దక్కిన రామప్ప రాతిపై చెక్కిన ఇక్కడి శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతోందని పేర్కొన్నారు . చరిత్ర భవిష్యత్ తరాలకు ఎన్నో అంశాలను తెలియజేస్తుందని చెప్పారు. జీవకళ ఉన్న శిల్పకళాకృతులకు మరో రూపమే రామప్ప అని కితాబు నిచ్చారు. ఎంతో ఘన చరిత్ర గల రామప్పను సందర్శించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం లక్నవరం సస్పెన్షన్ వంతెన పై విహరిస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ డి .ఈ ఆపరేషన్ ములుగు పులుసం నాగేశ్వర్ రావు, ఏడిఈ వేణు గోపాల్ , విజిలెన్స్ ఎస్ఐ పురుషోత్తం, ఏ.ఈ రమేష్, కిషోర్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు .
…………………………………………..
