
– బిజెపి పార్టీ బహిరంగ క్షమాపణలు చెప్పాలి
– హుజురాబాద్ యూత్ కాంగ్రెస్
ఆకేరు న్యూస్,హుజురాబాద్/ కమలాపూర్ : వయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రమేష్ బిధూరినీ బిజెపి పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.హుజురాబాద్ , కమలాపూర్ లోని ప్రధాన కూడల్ల వద్ద బుధవారం సాయంత్రం యూత్ కాంగ్రెస్ నాయకులు రమేష్ బీదూరి ఫ్లెక్సీతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. బిజెపి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పుకునే పార్టీ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబాన్నీ అవమానించే రీతిలో వ్యక్తిగత దూషణలు చేసిన రమేష్ బీదూరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. అంతే కాకుండా బిజెపి నాయకత్వం ప్రియాంక గాంధీకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి పార్టీ తన వైఖరిని మార్చుకోకపోతే స్థానికంగా ఉన్న బిజెపి నేతల ఇండ్లు ముట్టడిస్తామన్నారు. కమలాపూర్ లో సిఐ హరికృష్ణ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులని అదుపులోకి తీసుకునీ పోలీస్ స్టేషన్ కి తరలించారు.కార్యక్రమంలో హుజురాబాద్, కమలాపూర్ యూత్ కాంగ్రెస్ నాయకులు, పోడేటి బిక్షపతి, దూడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………