ఆకేరు న్యూస్, హనుమకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం రంజాన్ వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు మసీదులు, ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ లోని మట్టేవాడ, ఎల్బీనగర్, ఖిలా వరంగల్ లో నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని అల్లాను వేడుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
