
* తుది శ్వాస విడిచిన తొలి తెలుగు గాయని
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : తెలుగు తొలి నేపధ్య గాయని బాల సరస్వతి (97) కన్నుమూశారు. తొంభై ఏడేళ్ల నిండు జీవితాన్ని అనుభవించిన బాల సరస్వతి బుధవారం ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో కన్నుమూశారు. 1928 ఆగస్ట్ 29న జన్మించిన రావు బాలసరస్వతి గొంతు ఆకాశవాణి సంగీత కార్యక్రమాలతో తెలుగు వారికి సుపరిచితం. ఆరేళ్ల వయస్సు నుంచే పాటలు పాడడం ప్రారంభించిన బాల సరస్వతి తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో మొత్తం 2000కి పైగా ఆమె పాటలు పాడారు. లలిత సంగీత దిగ్గజంగా పేరొందిన బాల సరస్వతి దేవి 1939లో మహానంద సినిమాతో తెలుగులో తొలి నేపధ్య గాయనిగా గుర్తింపు పొందారు. ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పరిచయమైన బాల సరస్వతి.. ‘సతీ అనసూయ’ సినిమాలో తొలి పాటను పాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ తొలి దశలో అనేక మధుర గీతాలు ఆలపించారు. తెలుగు, తమిళ సినిమాల్లో 1930 నుంచి 1960 వరకు పాటలు పాడటంతో పాటు పలు చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు.
…………………………………………………………………