
* ఆలస్యంగా వెలుగులోకి..
ఆకేరు న్యూస్ డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన 17 ఏళ్ల బాలికను కొంతమంది ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. బంధువుల ఇంటికి వాజేడు వెళ్లేందుకు చర్ల మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఆటో ఎక్కింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చిఇతర డ్రైవర్లతో కలిసి సామూహిక ఆత్యచారానికి పాల్పడినట్లు సమాచారం. విషయం తెలుకున్న స్థానికులు బాలికను సంరక్షణ కేంద్రానికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.బాలిక శరీరం పై ఉన్న గాయాలను చూసి పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
……………………………..