
* చంపేసి పరారైన యువకుడు
* నల్గొండలో ఘటన
ఆకేరు న్యూస్, నల్గొండ : నల్గొండలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. ఆమెను చంపేసిన ఓ యువకుడు పరారయ్యాడు. ఆమె చదివే కళాశాలకు సమీపంలోనే ఆమె చనిపోయి ఉండడం కలకలం రేపుతోంది. హత్యకు ముందు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల ఇంటర్ విద్యార్థి (17)నిగా ఆమెను గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. ఆమె ట్రాక్టర్ డ్రైవర్ గడ్డం కృష్ణతో ఆరు నెలలుగా ప్రేమలో ఉంది. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్తున్న విద్యార్థినికి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి కళాశాల సమీపంలోని తన మిత్రుడైన ఆటో డ్రైవర్ రూమ్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. డీఎస్పీ శివరాం రెడ్డి, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూటౌన్ ఎస్సై సైదులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
…………………………………………..