
* శ్యాం నాయక్‌ను వాటర్ బాటిల్ తో కొట్టిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
ఆకేరున్యూస్, ఆసిఫాబాద్ : ఇటీవల ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో గొడవలు జరగడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ ఎస్ నేతల మధ్య ఈ గొడవలు జరుగున్నాయి. బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే ఉన్న చోట అధికార కాంగ్రెస్ ్రపొటోకాల్ పాటించడం లేదని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదంటున్నారు.ఇటీవల మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్న రెండు మూడు కార్యక్రమాల్లో ఇలాగే జరిగింది. అధికార పక్షం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఖాతరు చేయడం లేదని సభితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. తమ నియోజక వర్గ ప్రజలకు సంబందించిన కార్యక్రమాల్లో పాల్గొనకూడదా అని ప్రశ్నించారు. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ ఇలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ పట్టణంలోని జనకాపూర్ రైతు వేదిక వద్ద రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి తో పాటు కాంగ్రెస్ ఇన్చార్జి శ్యామ్ నాయక్ పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి ఎమ్మెల్యే కోవ లక్ష్మి వివరిస్తుండగా శ్యాం నాయక్ అడ్డు తగిలారు. గత ప్రభుత్వం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ అభ్యంతరం వెళిబుచ్చారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగింది. సహనం కోల్పోయిన కోవ లక్ష్మి శ్యామ్ నాయక్‌పై వాటర్ బాటిల్ విసిరింది, దీంతో శ్యామ్ నాయక్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో కొంత సేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
……………………………………………