
* పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి
ఆకేరు న్యూస్, జనగామ: అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు అందే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పాలకుర్తి ఎమ్మెల్యే ఎం. యశశ్విని రెడ్డి అన్నారు. సోమవారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, దేవరుప్పుల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల పట్ల తీవ్ర అన్యాయం చేశాయన్నారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పేదల కష్టాలను అర్థం చేసుకుని వారి సమస్యల పరిష్కారానికి నడుం బిగించిందన్నారు.. ఆహార భద్రతతో పాటు, రేషన్ కార్డు ద్వారా పేదలకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని, ఇది న్యాయమైన హక్కుగా పరిగణించాలని అన్నారు. పల్లె ప్రజలకు అండగా నిలిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల అధ్యక్షులు గిరగానీ కుమారస్వామి, నల్ల శ్రీరాములు , మార్కెట్ చైర్ పర్సన్ లు నల్ల అండాలు, లావుడ్య మంజుల, మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
………………………………………..