
* యువతులతో అర్ధనగ్న డ్యాన్సులు
* సడెన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు
* 9 మంది అరెస్టు
* డ్రగ్స్, మద్యం బాటిళ్లు స్వాధీనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కొండాపూర్‌లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ చేసుకుంటున్న 9మందిని అరెస్టు చేశారు. వారి నుంచి డ్రగ్స్, మద్యం బాటిళ్లు, ఆరు కార్లు స్వాధీనం చేసుకున్నారు. 11మందిపై కేసు నమోదు అయింది. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే ఇద్దరు మరికొంతమందితో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా వీకెండ్ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జల్సారాయుళ్లను హైదరాబాద్ కొండాపూర్‌కి తీసుకువచ్చి సర్వీస్ అపార్మెంట్లలో రేవ్ పార్టీ నిర్వహిస్తుంటారు. శనివారం నాడు ఏపీకి చెందిన కొంతమంది వ్యక్తులను,యువతులను తీసుకువచ్చి రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. అమ్మాయిలతో అసభ్యకర నృత్యాలు చేయిస్తూ మందు, చిందు, డ్రగ్స్ లో మునిగిపోయారు. రేవ్ పార్టీ విషయమై శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందగా, ఎస్సై సంధ్య బాలరాజు, సిబ్బందితో కలిసి దాడి చేశారు. 9 మందిని అరెస్టు చేశారు. 2.08 కేజీల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నాలుగు కార్లు, 11 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ప్రధాన నిందితులు ఏపీకి చెందిన వాసు, శివం రాయుడుగా పోలీసులు గుర్తించారు.
………………………………………….