
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ విభాగం అదనపు డీసీపీ గా రాయల ప్రభాకర్ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ను మర్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేశారు.ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ పనిచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీపై వచ్చిన ప్రభాకర్ రావు గతంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏసీపీగా పనిచేయడంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా లో వివిధ హోదాల్లో సమర్ధవంతంగా పనిచేశారు.
……………………………………….