Dry Crops Farmer Advisory
ఆకేరు న్యూస్,రాయపర్తి:
ఈ సంవత్సరం తీవ్రమైన ఎల్నీనో (El Niño) ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, కాబట్టి రైతులు నీటి ఎద్దడిని తట్టుకునేలా వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని రాయపర్తి మండల వ్యవసాయ అధికారి (AO) గుమ్మడి వీరభద్రం పిలుపునిచ్చారు.
రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ
సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వర్షపాతం చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు సమయానికి పడకపోవడం వల్ల బావులు, చెరువులలో నీటి నిల్వలు సరిపడా లేవు. నీటి మట్టాలు తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వరి నాట్లు వేస్తే రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
వరికి బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలైన విత్తన జొన్న, శనగ, మినుము, పెసర, ఆవాలు, వేరుశనగ వంటి పంటలను సాగు చేయాలని సూచించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆరుతడి పంటలు మంచి దిగుబడిని ఇస్తూ, నీటి కొరతను తట్టుకుని రైతులకు నిలకడైన ఆదాయాన్ని ఇస్తాయని స్పష్టం చేశారు.
”వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకుని రైతులు క్షేత్రస్థాయిలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వరి నాట్లు వేసి పెట్టుబడి నష్టపోకుండా, ఆరుతడి పంటలను ఎంచుకుని లాభాలు గడించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారే సహేంద్ర బిక్షపతి, ఏ ఈ ఓ ఎస్ గీత, గ్రామ పంచాయతీ కార్యదర్శి యాకుబ్ నాయక్, మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు
—

Please tell us what is wrong. Your report will be sent to the website team.
