– ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వార్తాపత్రికల పఠనాన్ని తప్పనిసరి చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్లలో సోషల్ మీడియాను చూసే సమయాన్ని తగ్గించి, పుస్తక పఠనం బలోపేతం చేయడానికి పాఠశాలలకు ఆదేశాలు జారీచేసింది. పాఠశాల గ్రంథాలయాల్లో వార్తాపత్రికలను అందుబాటులో ఉంచాలని పేర్కొంది.ప్రతిరోజూ ఉదయం విద్యార్థుల్ని ప్రార్థన కోసం సమావేశపరిచే సమయంలో పది నిమిషాల పాటు వార్తాపత్రికల పఠనానికి కేటాయించాలని స్పష్టంచేసింది. విద్యార్థుల భాష,విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పదును పెట్టడానికి పత్రికా పఠన సహాయపడుతుంది. ఇది వ్యక్తిత్వ వికాసానికి, వేగంగా మారుతున్న ప్రపంచంలో పరిణామాలతో విద్యార్థులను అప్డేటెడ్ గా ఉంచుతుందని, ఈ నిర్ణయం పట్ల పలువురు విద్యావేత్తలు అంటున్నారు. దేశవ్యాప్తంగా పాఠశాలలో పత్రిక పఠనం అమలు చేయాలని అభిప్రాయపడుతున్నారు.
………………………………………………….

