
* అధికారులకు సభాపతి కీలక ఆదేశాలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రేపటి నుంచి తెలంగాణ (Telangana) శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukenderreddy), వైస్ చైర్మన్, అసెంబ్లీ కార్యదర్శి, సీఎస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. శాంతిభద్రతలు, ప్రొటోకాల్, ట్రాఫిక్ పై పోలీసు ఉన్నతాధికారులతో సభాపతి సమీక్షించారు. అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో సభ్యులు ఎటువంటి ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. మొదటి రోజున ఇటీవల మరణించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సభలో సంతాపం ప్రకటించనున్నారు. ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎన్నిక జరగనుండగా, కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై చర్చించే అవకాశముందని తెలుస్తోంది.
స్పీకర్ ను కలిసిన బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు
అసెంబ్లీలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ద్వారా వివరించే అవకాశాన్ని బీఆర్ఎస్ఎల్పీకి కల్పించాలని స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్‌ను కలిసిన వారిలో అసెంబ్లీలో బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి ఎం రమేష్ కుమార్ రెడ్డి ఉన్నారు.
…………………………………………