* ఓకే చెప్పిన కేంద్ర ప్రభుత్వం
ఆకేరు న్యూస్ డెస్క్ : దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స పై చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రతిపక్షాలు గత కొంత కాలంగా తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నాయి. సర్ పేరిట బీజేపేతర ఓట్లు గల్లంతువుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీహార్ లో ఇండియా కూటమి ఓటమికి కారణం సర్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సర్ పై పార్లమెంట్ లో చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న విషయం తెల్సిందే.. ఈ నేపధ్యంలో సర్ పై చర్చించేందుకు ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. మంగళవారం మధ్యాహ్నం ఫ్లోర్ లీడర్ల తో స్పీకర్ ఓం బిర్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్ పై చర్చించేందుకు అంగీకారం తెలిపారు. సర్ తో పాటు ఎన్నికల సంస్కరణలపై కూడా చర్చించేందుకు కేంద్రం ప్రభుత్వం అంగీకరించింది. అయితే బీఏసీలో నిర్ణయించిన ప్రకారం ‘వందేమాతరం’పై తొలుత చర్చ జరగాలని, ఆ తర్వాత అన్ని ముఖ్యమైన అంశాలపైనా చర్చించవచ్చని ప్రభుత్వం సూచించింది. ఈనెల 7వ తేదీతో వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందున దీనిపై తొలుత చర్చించేందుకే తాము ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించింది.
……………………………………………………
