
* స్థలాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల, సీఎస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ః : రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా (Rythu Bharosa) విజయోత్సవ సభలు నిర్వహించనున్నారు. సచివాలయం వద్ద కూడా ఈ సభ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల ద్వారా, రైతులతో సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈమేరకు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Tummala Nageswarao), సీఎస్ స్థలాన్ని పరిశీలించారు. కాగా రైతు భరోసా ఇవ్వడంలో తెలంగాణ సర్కారు సరికొత్త రికార్డును సృష్టించింది. ఈసారి వేగంగా రైతుల ఖాతాల్లో భరోసా సొమ్ము జమ చేస్తున్నారు. జూన్ 16న రైతు భరోసా వేదిక ద్వారా రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్నిప్రారంభించారు. తొలి ఆరు రోజుల్లోనే 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,770.83 కోట్లను జమ చేసింది. 9 రోజుల్లోనే రూ.9వేల కోట్ల పంపిణీని విజయవంతంగా పూర్తి చేయాలని ఆర్థిక శాఖ భావిస్తోంది.
…………………………………………..