
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
* ఢిల్లీలో రూ.11వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం
ఆకేరు న్యూస్, డెస్క్ : 11 ఏళ్లలో రికార్డు స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (NAREDNRA MODI)తెలిపారు. ఢిల్లీలో రెండు జాతీయ రహదారులను ఆయన ఆదివారం ప్రారంభించారు. ద్వారకా ఎక్స్ ప్రెస్ వే, అర్బన్ ఎక్సెటన్షన్ రోడ్డులను ఆయన ప్రారంభించారు. రూ.11 వేల కోట్లతో చేపట్టే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ ఢిల్లీ (DELHI) మెట్రో కనెక్టివిటీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు. కొత్తగా ప్రారంభించిన ద్వారకా ఎక్స్ ప్రెస్ వేతో ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. ఈ ప్రాజెక్టుకు ద్వారకా పేరు పెట్టామని, ప్రారంభోత్సవం రోహిణిలో జరుగుతోందని తెలిపారు. తాను కూడా ద్వారకా భూమికి చెందినవాడినని పేర్కొన్నారు. ఈ ఆగస్టు నెల స్వేచ్ఛ, విప్లవానికి చిహ్నాలైన రంగులతో నిండిపోయిందన్నారు. రూ. 5,360 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన ద్వారకా ఎక్స్ప్రెస్వే ద్వారా రాకపోకలు సులభం అవుతాయన్నారు. ఈ ప్రాజెక్ట్ యశోభూమి కన్వెన్షన్ సెంటర్, ఢిల్లీ మెట్రో బ్లూ మరియు ఆరెంజ్ లైన్లు, రాబోయే బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా క్లస్టర్ బస్ డిపోకు బహుళ-మోడల్ కనెక్టివిటీని అందిస్తుందని వెల్లడించారు.
………………………………………