
* ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాంగటి సునీత తరఫున ప్రచారం నిర్వహించారు.జీహెచ్ఎంసీ కార్పొరేటర్ దేదీప్య రావు ఇతర డివిజన్ నాయకులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సంర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మందు ప్రజలకు మోసపూరిత వాగ్ధాణాలు చేసి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్ధాణాల్లో ఏ ఒక్క వాగ్ధాణం అమలు కాలేదన్నారు. ప్రతీ ఓటరు పదేళ్లలో కేసీఆర్ ఏం చేశారనేది గుర్తుంచుకొని ఓటేయాలని కోరారు. ప్రచారంలో ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ పాలకుర్తి నాయకులు పాల్గొన్నారు. అంతకు మందు ఆయన జూబ్లీహిల్స్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
………………………………………………..