* హనుమకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్
ఆకేరు న్యూస్, హనుమకొండ : ఫోన్ వాడకాన్ని తగ్గించి.. చదువుపై శ్రద్ధ పెట్టాలని కాకతీయ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శ్రీనివాస్ విద్యర్థులకు సూచించారు. కాకతీయ ప్రభుత్వ కళాశాల (స్వయంప్రతిపత్తి), హనుమకొండలో అంతర్గత ఫిర్యాదుల కమిటి (ఐసిసి) ఆధ్యర్యంలో విద్యార్థినుల భద్రతపై అవగాహనా కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థినులు చదువుపై శ్రద్ధ పెట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకని మెలగాలని సూచించారు. పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలని, విద్యా ర్థినులు కూడా తల్లిదండ్రుల మాట వింటూ తగు జాగ్రత్తలతో ఉండాలన్నారు. సమాజంతో అమ్మాయిలపై జరిగే దాడులు, అన్యాయాలను వివరిస్తూ, విద్యార్థినుల భద్రతపై అవగాహనా కలిగించారు. ముఖ్య అతిధిగా హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ కుమార్ ప్రస్తుతకాలంలో అమ్మా యిలపై జరుగుతున్న ఆఘాయిత్యాలకు, ఘోరాలను కన్ను లకు కట్టినట్లు వివరించారు. అమ్మాయిలు అధైర్య పడవద్దని ఎలాంటి ఆపద కలిగినా 100 సంఖ్యకు ఫోను చేస్తే పోలీసులు అందు బాటులో వుండి సమస్యను ను పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. వాట్సాప్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను వ్యక్తిగత విషయాలను పెట్టవద్దని, తెలియని వ్య క్తులతో పరిచయాలు చేయవద్దని, తెలియని లింకును తెరచవద్దని సైబరు నేరాలలో చిక్కుకోవద్దని అవగాహన కలిగించారు. ఈ క్యాక్రమంలో ఎస్ ఐ, హనుమకొండ కమల, ఐ సిసి కన్వీనర్ డా.ఎం. సమత, ఐక్యూసి కోఆర్డినేటర్ డా. ఎ. శ్రీనాథ్, ఐసిసి సభ్యులు డా. ఇ కమల, డా. ఎం. విజయలక్ష్మి, డా.వి. ఉమాదేవి, అధ్యాపకులు డా పి.రోహిణి ,డా.బి.సంధ్యారాణి విద్యార్ధినులు పాల్గన్నారు.

…………………………………………………
