![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/01/revanth-reddy_V_jpg-816x480-4g.webp)
* అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
ఆకేరున్యూస్, హైదరాబాద్: రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఆర్ఆర్ఆర్, అర్అండ్బీ, నేషనల్ హైవే ప్రాజెక్టులపై అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్ – విజయవాడ కారిడార్‌కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే అటవీ శాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అటవీశాఖ, ఆర్ అండ్‌బీ శాఖలు సమన్వయంతో ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆ రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ఇందుకు ప్రత్యేకంగా నియమించాలన్నారు. రెండు శాఖలు సమావేశమై సంబంధిత శాఖల పరిధిలోని భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలని.. కొత్త గ్రామ పంచాయతీలతో సహా ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందేనన్నారు.. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
………………………………..