
* మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భూ భారతి (Bhu Barathi)అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల చార్జీలు పెరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasreddy) తెలిపారు. దాదాపు 1000 మంది సర్వేయర్లను నియమిస్తామని వెల్లడించారు. భూముల రిజిస్ట్రేషన్ కు స్లాట్ విధానాన్ని తీసుకొస్తామన్నారు. గతంలో ఆన్ లైన్లో నమోదైన 12 లక్షల సాదా బైనామాలను పరిష్కరిస్తామని తెలిపారు. కొత్త సాదా బైనామాలను చెల్లవని స్పష్టం చేశారు. అసైన్డ్ భూములు (Assigned Lands) అమ్ముకోవడానికి వీల్లేదని అన్నారు. మీడిమాతో చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎల్ ఆర్ ఎస్‌కు మంచి స్పందన ఉందన్నారు. ఇప్పటికైనా ఎల్ ఆర్ ఎస్ (LRS) గడువు పెంచే ఆలోచన లేదన్నారు.
…………………………….