
* ఎన్నికల సంఘాన్ని కోరిన బీఆర్ ఎస్
ఆకేరు న్యూస్ డెస్క్ : భారతదేశంలో రాష్ట్రాల అసెంబ్లీ(ASSEMBLY)లకు, లోక్సభ(LOKSABHA)కు జరిగే ఎన్నికల్లో ఈవీఎం(EVM)ల స్థానంలో తిరిగి బ్యాలెట్ పేపర్ (BALLET PAPER)లు తీసుకురావాలని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అన్నారు,ఢిల్లీలో ఎన్నికల సంస్కరణ(ELECTION REFORMS) లపై దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు బి. వినోద్ కుమార్,సురేష్ రెడ్డి,బాల్క సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణను బీఆర్ ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని కేటీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. తిరిగి బ్యాలెట్ పద్దతినే తీసుకురావాలని కోరామన్నారు. ఎన్నికల సందర్బంగా రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలపై నియంత్రణ ఉండాలన్నారు. హామీలు తీర్చని పక్షంలో చర్యతీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలని కోరామన్నారు. హామీలు నేరవేర్చని సభ్యులను అనర్హులుగా ప్రకటించాలన్నారు.అడ్డగోలు హామీలతో రాజకీయ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. బీహార్ లో జరుగుతున్న పరిణామాలను కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం అని కేటీఆర్ అన్నారు. దాదాపు 60 లక్షల ఓట్లు బిహార్ లో గల్లంతయిన విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఓటర్ల లిస్లు తయారీలో క్షేత్రస్థాయి నుంచే పారదర్శకంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘానికి సూచించామని తెలిపారు.గ్రామ స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు పారదర్శకంగా వ్యవహరరించాలని ప్రజలను మేధావులను ప్రజాసంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించామన్నారు. కారు గుర్తును పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించవద్దని కోరామని దీంతో గతంలో బీఆర్ ఎస్ పార్టీకి నష్టం జరిగినట్లు వివరించామని కేటీఆర్ తెలిపారు.
……………………………..