* శునకాన్ని వెనక్కి పంపించిన భద్రతా సిబ్బంది
ఆకేరు న్యూస్, డెస్క్ : పార్లమెంట్ శీతాకాల ప్రారంభం అయిన వేళ పార్లమెంట్ ప్రాంగణంలోకి ఓ శునకం ప్రవేశించింది. భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని శునకాన్ని వెనక్కి పంపించారు. వివరాల్లోకి వెళితే కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కారులో తన పెంపుడు జంతువుతో పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించారు. . దీన్ని గమనించిన పార్లమెంట్ భద్రతా సిబ్బంది భద్రతా కారణాల దృష్ట్యా పార్లమెంట్ ఆవరణలోకి పెంపుడు జంతువులు తీసుకురాకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు. శునకాన్ని తిరిగి ఆమె నివాసానికి పంపించి వేశారు. ఇప్పటికే ఢిల్లీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయనే విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయం తెల్సిందే..బహిరంగ ప్రదేశాల్లో జన సమూహాల వద్ద వీది కుక్కలను రానీయకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ నేపధ్యంలో ఎంపీ రేణుకా చౌదరి శునకంతో పార్లమెంట్ కు రావడం చర్చనీయాంశం అయింది.
……………………………………………………
