– వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో పొన్నం,శ్రీధర్ బాబు కు మేమొరండం అందజేసిన లాయర్లు
ఆకేరు న్యూస్, హుజురాబాద్ : జమ్మికుంట,వీణవంక,ఇల్లందుకుంట మండలాలకు సంబంధించి జమ్మికుంటలో ప్రథమ శ్రేణి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ కమ్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలని లాయర్లు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రులు పొన్నం ప్రభాకర్,శ్రీధర్ బాబు లకు మెమొరండం అందజేశారు.ఈ విషయమై నిన్న హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రులను 30 మంది లాయర్ల కలిశారు.అనంతరం వారు మాట్లాడుతూ ఈ విషయంపై మంత్రులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదులు వంగళ పవన్ కుమార్,ఎభూషి లింగారెడ్డి,నక్క సత్యనారాయణ,మొలుగూరి సదయ్య, హుజురాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నూతాల శ్రీనివాస్,రావిగంటి మధు బాబు,పిట్టల రాజేష్,అబ్బరవేణి రాజు,యంగల లింగమూర్తి,గూడేపు వంశీ కృష్ణ,గుండా వరప్రసాద్,మారపల్లి శ్రీధర్,దుడపాక శ్రీనివాస్,గోపరాజు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………….
