
* బొల్లు రమేష్ కుమార్ ముదిరాజ్
* అఖిలపక్షం ఆధ్వర్యంలో బీసీ బంద్
ఆకేరు న్యూస్, ములుగు:ములుగు జిల్లా తాడ్వాయి మండలకేంద్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లు రమేష్ కుమార్ ముదిరాజ్ ఆధ్వర్యంలో బిసి బంద్ విజయ వంతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బిసి లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కృత నిశ్చయంతో ఉన్నారని అన్నారు. .అసెంబ్లీలో బిల్లు తీర్మానం జీవో 9 జారి చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగిందని .డిల్లీలో రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్ సాక్షిగా ధర్నా నిర్వహించిన సంగతి గుర్తుచేశారు. బిసి బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదం తెలిపవలసిన అవసరం ఉన్నదన్నారు. మనువాద అగ్రకుల బ్రాహ్మణీయ వ్యవస్థ అందుకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. ఈ కారణంగా కోర్టులు 42% రిజర్వేషన్ బిల్లు పై స్టే విధించడం బాధాకరం బిసి సంఘాలు ఐక్యత గా పోరాడి సాదించు కోవలసిన బాధ్యత మన పై ఉన్నదన్నారు. బిసి సమాజం కోసం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించు కోవలసిన బాధ్యత మనపైన మన యువతరం పైన ఉన్నది అని సాధించు కున్నప్పుడే బిసి బిడ్డల భావితరాల భవిష్యత్తుకు బాటలు పడుతాయని బొల్లు రమేష్ కుమార్ ముదిరాజ్ తెలిపారుఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరరావు,జిల్లా యూత్ నాయకులు బొల్లు నాగేంద్ర కుమార్, మండల బ్లాక్ అద్యక్షులు ముజాఫర్, సీనియర్ నాయకురాలు ముండ్రాతి రాజశ్రీ, గ్రామ కమిటీ అధ్యక్షుడు పాక రాజేందర్, పబ్బోజు రవీంద్రా చారి,బీసీ సంఘం మండల అధ్యక్షుడు భూషబోయిన రవికుమార్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండారి చంద్రయ్య,బీసీ జాతీయ సంక్షే సంఘం మండల అధ్యక్షుడు తుమ్మల మల్లేష్ యువత, వివిధ కులసంఘాలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
…………………………………….