
* జీహెచ్ ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ ఎఫ్ అప్రమత్తంగా ఉండాలి
* అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్లోని ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటనే పరిష్కరించాలని అన్ని విభాగాల అధికారులనూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTHREDDY) ఆదేశించారు. జీహెచ్ ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ ఎఫ్, అగ్నిమాపక శాఖలు తక్షణమే స్పందించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ (HYDERABAD)వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వర్షాల ప్రభావం అధికంగా ఉండే జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్(NDRF), ఎన్డీఆర్ఎఫ్ (SDRF)సహా అన్ని సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వాగులు పొంగే ప్రమాదమున్న జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జలాశయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని సూచించారు. సీఎం (CM) ఆదేశాలతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులు నిరంతరం సమీక్షిస్తున్నారు.
……………………………………